సంక్రాంతికి సరికొత్త వినోదం.. ‘మ్యూజిక్ ఎన్ ప్లే’తో ‘ఎన్ టీవీ’ సిద్ధం

ఎన్ టీవీ ఎల్లప్పుడు వినోదానికి పెద్ద పీట వేస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ సంక్రాంతికి మీ అందరికి మరింత వినోదాన్ని పంచడానికి మరో సరికొత్త షోతో రెడీ అయిపోయింది ఎన్ టీవీ. ప్రతి మనిషి బాధలో ఉన్నా.. సంతోషంలో ఉన్నా చేసే ఒకేఒక్క పని మ్యూజిక్ వినడం.. ఈసారి ఎన్ టీవీ సంగీత అభిమానులను ఉర్రుతలూగించే ప్రోగ్రామ్ తో వచ్చేసింది. టాలీవుడ్ టాప్ సింగర్ సాకేత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ‘మ్యూజిక్ ‘ఎన్’ ప్లే’. ఈ షో ప్రోమోని ఇటీవలే రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ షో లో టాప్ సింగర్స్ ఆటాపాటతో పాటు టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ తో ఇంటర్వ్యూ ప్రోమో అదరగొట్టేశారు. థమన్ కామెడీ, సాకేత్ పంచులతో ప్రోమో అదిరిపోయింది. ఇక ఈ షో ఈ సంక్రాంతి నుంచి మొదలుకానుంది. ప్రస్తుతం ఈ షో ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రోమో పై ఓ లుక్కేసేయండి..

Related Articles

Latest Articles