‘ఖల్ నాయక్’కి యూఏఈ దేశపు ‘స్పెషల్ గిఫ్ట్’… థాంక్స్ చెప్పిన ‘మున్నాభాయ్’!

మన సినిమా సెలబ్రిటీలకు విదేశాల్లో పురస్కారాలు, గౌరవాలు దక్కటం ఇప్పుడు కొత్తేం కాదు. ఫ్రాన్స్ లాంటి దేశాల్లో మన వారికి చాలా మందికి అత్యున్నత అవార్డులు దక్కాయి. అదే విధంగా, మైనపు బొమ్మల ప్రదర్శనశాలల్లోనూ ఇండియన్ సినీ సెలబ్స్ వ్యాక్స్ స్టాచ్యూస్ ప్రపంచాన్ని పలుకరిస్తూ ఉంటాయి. అయితే, ఇప్పుడు సంజయ్ దత్ కి కూడా యూఏఈ ప్రభుత్వం నుంచీ ప్రత్యేక గౌరవం దక్కింది. అయితే, ఇది ఏ అవార్డో, మైనపు బొమ్మ ఆవిష్కరణో కాదు….
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశం మన మున్నాభాయ్ కి గోల్డెన్ వీసా మంజూర్ చేసింది. పదేళ్ల కాలం కోసం ఈ స్పెషల్ వీసా సంజయ్ దత్ కు ఇచ్చారు. తనకు యూఏఈ వీసా లభించిన విషయం ట్విట్టర్ లో తెలియజేస్తూ ఆయన ఆ దేశ డైరెక్టర్ జనరల్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే, యూఏఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసిన సంజు బాబా ‘ఫ్లై దుబాయ్’ విమానయాన సంస్థ సీఓఓకి కూడా థాంక్స్ చెప్పాడు.
యూఏఈ తమ దేశ అభివృద్ధికి ఉపయోగపడతారని భావించి పలువురు ‘టాలెంటెడ్ పీపుల్’కి పదేళ్ల పాటూ ‘గోల్డెన్ వీసా’ మంజూర్ చేయాలని ఈ మధ్యే నిర్ణయించింది. అందులో భాగంగానే బాలీవుడ్ సెలబ్రిటీ అయిన సంజయ్ దత్ కి స్పెషల్ వీసా ఇచ్చింది. వివిధ దేశాల్లోని తెలివైన వార్ని ‘గ్రేట్స్ మైండ్స్’గా అభివర్ణిస్తూ గల్ఫ్ దేశం తమ ఎదుగుదలకు వారి సేవల్ని వినియోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. చూడాలి మరి, ‘ఖల్ నాయక్’ ఆ దేశానికి ఎలా సాయపడతాడో…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-