ఐపీఎల్ 2021 : ముగిసిన పంజాబ్ ఇన్నింగ్స్

ఈరోజు ఐపీఎల్ 2021 లో రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లు కేఎల్ రాహుల్(21), మన్ దీప్ సింగ్ (15) పరుగులకే వెనుదిరిగ్గారు. ఆ తర్వాత వచ్చిన గేల్(1) కూడా నిరాశపరచగా దీపక్ హుడా(28) తో కలిసి ఐడెన్ మార్క్రమ్(42) ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. కానీ మిగిలిన వారు ఎవరు రాణించకపోవడంతో పంజాబ్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేసింది. ఇక ముంబై బౌలర్లలో పొలార్డ్, బుమ్రా రెండు వికెట్లు తీయగా కృనాల్ పాండ్య, రాహుల్ చాహర్ ఒక్కో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే ముంబై 136 పరుగులు చేయాలి. అయితే గత మ్యాచ్ లో ఇంతకంటే తక్కువ స్కోర్ ను హైదరాబద్ పై కాపాడుకొని పంజాబ్ విజయం సాధించగా… ఆర్సీబీ చేతిలో ముంబై ఇంతకంటే తక్కువ పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది. చుడాలిమరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

-Advertisement-ఐపీఎల్ 2021 : ముగిసిన పంజాబ్ ఇన్నింగ్స్

Related Articles

Latest Articles