ఐపీఎల్ 2021 : రాజస్థాన్ కు షాక్ ఇచ్చిన ముంబై…

ఈరోజు ఐపీఎల్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 172 పరుగుల లక్ష్యంతో వచ్చిన ముంబై జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ(14) ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్(16) కూడా నిరాశపరిచిన ఓపెనర్ క్వింటన్ డి కాక్, క్రునాల్ పాండ్య(39) కలిసి జట్టును విజయం వైపుకు నడిపించారు. కానీ చివర్లో క్రునాల్ ఔట్ అయిన డికాక్ (70) అర్ధశతకం పూర్తి చేసిన చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచాడు. అందువల్ల ముంబై 18.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. దాంతో ఈ ఐపీఎల్ లో మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ముంబై.

ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన రాజస్థాన్ జట్టులో ఓపెనర్లు జోస్ బట్లర్ (41), యషస్వి జైస్వాల్ (32) తో రాణించారు. ఆ తర్వాత కెప్టెన్ సంజు సామ్సన్ (42), శివం దుబే (35) ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. దాంతో 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది రాయల్స్.

Related Articles

Latest Articles

-Advertisement-