ఐపీఎల్ 2021 : టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేయనున్న పంజాబ్

ఈరోజు ఐపీఎల్ 2021 లో డబుల్ హెడర్ సందర్భంగా రెండు మ్యాచ్ లు జరుగుతున్నాయి. అందులో భాగంగా రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరగనుండగా ఇందులో టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు 8 పాయింట్లతో ఉన్నాయి. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారికీ ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగవుతుండటంతో రెండు జట్లు ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలవాలని అనుకుంటున్నాయి. ఇక ఈ మ్యాచ్ కోసం పంజాబ్ జట్టు ఒక్క మార్పుతో వస్తుంటే ముంబై రెండు చేంజ్ లు చేసింది. ఇక ఈ సీజన్ లో మొదటిసారి ఈ రెండు జట్లు తలపడగా పంజాబ్ విజయం సాధించింది. చూడాలి మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది.

పంజాబ్ : కేఎల్ రాహుల్(C/WK), మన్ దీప్ సింగ్, క్రిస్ గేల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, హర్ ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్ సింగ్

ముంబై : రోహిత్ శర్మ (C), క్వింటన్ డి కాక్ (WK), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, కృనాల్ పాండ్య, హార్దిక్ పాండ్య, కిరాన్ పొలార్డ్, నాథన్ కౌల్టర్-నైల్, రాహుల్ చాహర్, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

-Advertisement-ఐపీఎల్ 2021 : టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేయనున్న పంజాబ్

Related Articles

Latest Articles