థ‌ర్డ్ వేవ్ ఎఫెక్ట్‌: జ‌న‌వ‌రి మిడ్‌లోనే… ముంబై ఢిల్లీలో…

దేశంలోకి థ‌ర్డ్ వేవ్ ఎంట‌ర్ అయిందని చెప్ప‌డానికి పెరుగుతున్న కేసులే ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు.  జ‌న‌వ‌రి చివ‌రి వారంలో లేదా ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో క‌రోనా కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  అయితే, ముంబై, ఢిల్లీ వంటి మ‌హాన‌గ‌రాల్లో ప్ర‌తిరోజూ కేసులు పీక్స్‌లో న‌మోద‌వుతున్నాయ‌ని, జ‌న‌వ‌రి మిడిల్ వ‌రకు 30 వేల నుంచి 60 వేల మ‌ధ్య‌లో కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఐఐటి కాన్పూర్ శాస్త్ర‌వేత్త మ‌హీంద్రా అగ‌ర్వాల్ పేర్కొన్నారు.  కేసుల‌తో పాటు ఆసుప‌త్రుల్లో చేరేవారి సంఖ్య‌కూడా పెరుగుతుంద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి.  

Read: లాక్‌డౌన్ అవ‌స‌రం లేదు… కానీ…

ఆసుప‌త్రులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాల‌ని, ఆక్సీజ‌న్, బెడ్స్ సౌక‌ర్యాలు ఏర్పాటు చేసుకోవాల‌ని ఐఐటి కాన్పూర్ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  ఇక దేశంలో ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 15 వ‌ర‌కు దేశంలో థ‌ర్డ్ వేవ్ పీక్స్‌కు చేరుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు ఐఐటి మ‌ద్రాస్ అంచ‌నా వేసిన సంగ‌తి తెలిసిందే.  దేశంలో థ‌ర్డ్ వేవ్ పీక్స్‌కి చేరుకుంటే రోజుకు 4 నుంచి 8 ల‌క్ష‌ల వ‌ర‌కు కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  

Related Articles

Latest Articles