సల్మాన్ పై గేమ్… కోర్టు తీర్పుతో భాయ్ కి ఊరట

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై ఓ కంపెనీ గేమ్ ను రూపొందించి వదిలింది. దీనికి యూజర్స్ నుంచి కూడా విశేషమైన స్పందన లభిస్తోంది. కానీ అది సల్మాన్ ను మాత్రం కలవర పెట్టింది. తన పేరు మీద గేమ్ సృష్టించడం, అది కూడా పాపులర్ అవుతుండడం సల్మాన్ కు ఎందుకు ఆందోళన కలిగిస్తుంది ? అనే డౌట్ రావొచ్చు. కానీ ఆ గేమ్ సల్మాన్ ను కంగారు పెట్టేసింది మరి. విషయం ఏమిటంటే… సల్మాన్ ఖాన్ 2002లో హిట్ అండ్ రన్ కేసులో చిక్కుకున్నప్పుడు భారీ ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కేసు తుది తీర్పు పొందడానికి 10 సంవత్సరాలకు పైగా పట్టింది మరియు 2015 లో సల్మాన్ అన్ని ఆరోపణల నుండి విముక్తుడయ్యాడు.

Read Also : “సర్కారు వారి పాట”లో కాంగ్రెస్ ఎంపీ

ఇప్పుడు ముంబైకి చెందిన ఒక స్థానిక కంపెనీ ఈ సంఘటనపై ఒక గేమ్‌ను రూపొందించింది. దానికి “సెల్మన్ భోయ్” అని పేరు పెట్టింది. ఇదే సల్మాన్‌ను కలవరపెట్టింది. గతానికి సంబంధించి, పైగా ఇన్ డైరెక్టుగా తన పేరుతో ఈ గేమ్ తయారు చేసిన మేకర్స్ పై కేసు నమోదు చేశాడు సల్మాన్. వాదనలు విన్న తర్వాత ముంబై కోర్టు గేమ్ కు సంబంధించిన పేరడీ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్, డైరెక్టర్లు ఆ గేమ్ ను తీసివేయాలంటూ ఆదేశించింది. అంతేకాదు ఆ గేమ్ ను మళ్ళీ లాంచ్ చేయొద్దని, రీలాంచ్, రీక్రియేట్ కూడా చేయకూడదని తీర్పును వెలువరించింది. పైగా ఈ గేమ్ ను ప్లే స్టోర్ నుంచి కూడా తీసేశారు. దీంతో సల్లూ భాయ్ కి ఊరట కలిగిందన్న మాట.

Related Articles

Latest Articles

-Advertisement-