సమంతను ముంబై రమ్మంటోందా ? రెండు క్రేజీ ఆఫర్స్ ?

సమంత ఇటీవల కాలంలో చేస్తున్న ఫోటోషూట్లు చేస్తుంటే బాలీవుడ్ ఆమెకు రెడ్ కార్పెట్ వేస్తోందా ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దానికి తగ్గట్టుగానే సామ్ కు బాలీవుడ్ లో రెండు క్రేజీ ఆఫర్స్ వచ్చాయనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకు తగ్గట్టే ఇటీవల కాలంలో ఆమె గ్లామర్ షో ఎక్కువయ్యింది. నిన్నటికి నిన్న బ్లాక్ డ్రెస్ లో స్పైసీగా కన్పించిన సామ్ తాజాగా లూయిస్ విట్టన్ ఫోటోషూట్‌తో తన ఆకర్షణీయమైన లుక్‌లను స్ప్లాష్ చేసి మళ్లీ ఇంటర్నెట్‌ తన హ్యాండ్ ఓవర్ లోకి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే సామ్ అనుకున్నంత విరామం తీసుకోలేదని, వాస్తవానికి ఆమె త్వరలో ముంబైకి వెళుతుందని ప్రచారం జరుగుతోంది.

Read Also : ఫిట్నెస్ సెంటర్ ను లాంచ్ చేసిన సూపర్ స్టార్

ఈ స్టార్ హీరోయిన్ బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉంది. బజ్ ప్రకారం సామ్ అక్కడ ఒక పెద్ద స్టార్ చిత్రానికి సంతకం చేసిందని, ఇప్పటికే ఆమెకు రాజ్ & డికె నుంచి ఒక వెబ్ సిరీస్‌లో హీరోయిన్ ఆఫర్ ఉందని అంటున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ను ఓటిటి దిగ్గజం నిర్మించనుంది. వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. అయితే ఇవన్నీ జరగడానికి సమంత ముంబైలో ఇంటి వేటను ప్రారంభించినట్లు కూడా ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే సామ్ అక్కడ ఒక ప్రాపర్టీని కొంటుందని సమాచారం. కాగా గుణశేఖర్ “శాకుంతలం” పూర్తి చేసిన తర్వాత నిజానికి సమంత విరామం తీసుకోవాలనుకుంది. కానీ ఇప్పుడు ప్లాన్ మార్చినట్లు కనిపిస్తోంది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-