వాల్‌మార్ట్ బాట‌లో అంబానీ… ఆస్తుల పంప‌కం విష‌యంలో…

దేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని మ‌రింత‌గా విస్త‌రించుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు.  దాదాపు అన్ని రంగాల్లోకి ప్ర‌వేశించిన రిల‌య‌న్స్ సంస్థ రాబోయే రోజుల్లో మ‌రిన్ని రంగాల్లోకి విస్త‌రించాల‌ని చూస్తున్న‌ది.  అదే స‌మ‌యంలో త‌న ఆస్తుల‌ను ముగ్గురు పిల్ల‌ల‌కు పంచే విష‌యంలోనూ ముఖేష్ అంబానీ చాలా తెలివిగా ప‌క్కా ప్ర‌ణాళితో వ్య‌వ‌హ‌రించి రిల‌య‌న్స్ చీలిపోకుండా ఉండేందుకు ప‌థ‌కాలు వేస్తున్నారు.  దీనికోసం రిల‌య‌న్స్ ట్ర‌స్ట్ పేరుతో ఓ ట్ర‌స్ట్‌ను ఏర్పాటు చేయ‌బోతున్నార‌ని,  ఆ ట్ర‌స్ట్‌కు రిల‌య‌న్స్ కంపెనీ బాధ్య‌తలు అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని బ్లూంబర్గ్ త‌న క‌థ‌నాల్లో పేర్కొన్న‌ది.  

Read: తాజా స‌ర్వే: దేశంలో పెరిగిన మ‌హిళ‌ల రేషియో…

రిల‌య‌న్స్ ట్ర‌స్ట్‌లో ముఖేష్ అంబానీ, ఆయ‌న స‌తీమ‌ణి, ముగ్గురు పిల్ల‌ల‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు, కొంత‌మంది ముఖ్యులు ఉంటార‌ని తెలుస్తోంది.  ఇక ప్ర‌ధాన కంపెనీ వ్య‌వ‌హారాల‌ను ప్రోఫెష‌ల‌న్స్ కు అప్ప‌గించే అవ‌కాశం ఉంది.  రిల‌య‌న్స్‌లో ముఖేష్ అంబానీకి 50 శాతం వాటా ఉండ‌టంతో భ‌విష్య‌త్తులో రిల‌యన్స్ చీలిపోకుండా ఉండేందుకు అంబానీ ఈ నిర్ణ‌యం తీసుకోబుతోన్నార‌ని స‌మాచారం.  అమెరికా రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ కూడా ఇదే విధంగా గ‌తంలో చేసిన సంగ‌తి తెలిసిందే.  

Related Articles

Latest Articles