100 బిలియన్ డాలర్లు దాటిన అంబానీ సంపద

కరోనా కష్టకాలంలో కూడా ముఖేశ్‌ అంబానీ ఆస్తుల విలువ అనూహ్యంగా పెరుగుతూ పోయింది. పద్నాలుగేళ్లుగా దేశంలో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారాయన. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గల అత్యంత సంపన్నుల జాబితాలో కూడా చోటు సంపాదించారు ముఖేశ్‌ అంబానీ. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌గా ఉన్న ముఖే అంబానీ ఆస్తుల విలువ ఈ ఏడాది దాదాపు 24 బిలియన్‌ డాలర్లు పెరిగింది.

దీంతో ఆయన మొత్తం ఆస్తుల విలువ నూటొక్క బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. దీంతో బ్లూమ్‌బర్గ్‌ వంద బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో ముఖేశ్‌కు చోటు దక్కింది. బ్లూమ్‌బెర్గ్‌ కోటీశ్వరుల జాబితాలో 222 బిలియన్‌ డాలర్ల ఆస్తులతో మొదటి స్థానంలో ఉన్నారు టెస్లా ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ అధినేత ఎలన్‌ మస్క్‌. ఇక 191 బిలియన్‌ డాలర్ల ఆస్తులతో అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోన్‌ రెండో స్థానంలో నిలిచారు. బిల్‌గేట్స్‌, మార్క్‌ జుకర్‌బర్గ్‌ కూడా వంద బిలియన్‌ డాలర్ల క్లబ్‌ టాప్‌టెన్‌లో చోటు దక్కింది. వంద బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో 11వ స్థానంలో ఉన్నారు ముఖేశ్‌ అంబానీ.

-Advertisement-100 బిలియన్ డాలర్లు దాటిన  అంబానీ సంపద

Related Articles

Latest Articles