‘ముగ్గురు మొనగాళ్లు’ విడుదల తేదీ ఖరారు!

ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్‌ రెడ్డి ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి సినిమాల్లో హీరోగానూ నటించి మెప్పించాడు. ప్రస్తుతం అతను ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నాడు. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో చిత్రమందిర్‌ స్టూడియోస్‌ పతాకంపై అచ్యుత్‌ రామారావు ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీనివాస్‌ రెడ్డి మెయిన్ లీడ్‌ రోల్‌ చేస్తుండగా, దీక్షిత్‌ శెట్టి (కన్నడ హిట్‌ మూవీ ‘దియా’ ఫేమ్‌), వెన్నెల రామారావు ప్రధాన పాత్రలు పోషించారు.

Read Also : రాజ్ కుంద్రా చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు… కీలక ఆధారాలు లభ్యం

వీరిలో ఒకరికి కనిపించదు. మరొకరికి వినిపించదు. ఇంకొకరు మూగ. ఈ ముగ్గురు దివ్యాంగుల జీవితంలో ఊహించని విధంగా క్రైమ్ చోటు చేసుకుంటుంది. అదేమిటీ? దాని నుండి వీరు ఎలా బయటపడ్డారు? అసలు నగరంలో జరిగే హత్యలకు వీళ్ళకు ఏమిటీ సంబంధం? అనేదే ఈ చిత్ర కథ. ఆ మధ్య విడుదలైన ట్రైలర్ సినిమా మీద ఆసక్తిని రెట్టింపు చేసింది. ఈ ‘ముగ్గురు మొనగాళ్ళు’ సినిమాను ఆగస్ట్ 6న విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. త్విష్‌ శర్మ, శ్వేతా వర్మ, నిజర్, రాజా రవీంద్ర, జెమిని సురేష్, జోష్‌ రవి, బద్రం, సూర్య, జబర్తస్త్‌ సన్నీ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు సురేశ్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు.

Related Articles

Latest Articles

-Advertisement-