భయపెడుతున్న ఎంయు వేరియంట్‌… అప్రమత్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ‌…

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ప్ర‌పంచం ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకోలేదు.  వేగంగా కేసులు వ్యాప్తి చెందుతున్నాయి.  ఆల్ఫా, బీటా, ప్ర‌స్తుతం డెల్టా వేరియంట్ కేసులు అత్య‌ధికంగా న‌మోద‌వుతున్న సంగ‌తి తెలిసిందే.  అయితే,  డెల్టా వేరియంట్‌ల‌తో పాటుగా డెల్టా ప్ల‌స్ కేసులు కూడా అత్య‌ధికంగా న‌మోద‌వుతున్నాయి.  డెల్టా వేరియంట్‌తో పాటుగా సి 1.2 వేరియంట్ కూడా వ్యాపిస్తున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ తెలియ‌జేసింది.  ఈ వేరియంట్‌ను ద‌క్షిణాఫ్రికాలో గుర్తించారు.  ఇక‌పోతే, ఇప్పుడు ఎంయు అనే మ‌రో కొత్త వేరియంట్ ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతున్న‌ది.  ఈ ఎంయు వేరియంట్ ను సాంకేతికంగా బి.1.621 వేరియంట్‌గా పిలుస్తారు.  దీనిని మొద‌ట‌గా కొలంబియా దేశంలో గుర్తించారు.  ఈ వేరియంట్‌లో వేగంగా మ్యూటేష‌న్లు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ పేర్కొన్నది. 

Read: ఆఫ్ఘ‌నిస్తాన్ కోసం అమెరికా ఎంత ఖ‌ర్చుచేసిందో తెలుసా?

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-