‘7 డేస్ 6 నైట్స్’లో సుమంత్ అశ్విన్ కూడా!

‘డర్టీ హరి’ మూవీ తర్వాత ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ఈ చిత్రాన్ని సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ సమర్పణలో, వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పతాకం మీద సుమంత్ అశ్విన్, రజనీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా ప్రారంభంలో కేవలం నిర్మాతగానే సమంత్ అశ్విన్ పేరు కనిపించగా, ఇప్పుడు అతను కూడా ఇందులో హీరోగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. సుమంత్ అశ్విన్ సరసన మెహర్ చావల్ అనే కొత్తమ్మాయిని పరిచయం చేస్తున్నారు. వీరిద్దరితో పాటు రోహన్, కృతికా శెట్టి మరో జంటగా పరిచయమవుతున్నారు. ఈ నలుగురే కాకుండా సుష్మ, రిషికా బాలి ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో చక్కని నటన కనబరిచిన గోపరాజు రమణ అతిథిపాత్రలో కనిపించబోతున్నారు. గురువారం ఈ సినిమాకు సంబంధించిన విడుదల చేసిన పోస్టర్ తో సుమంత్ అశ్విన్ సైతం ఇందులో నటిస్తున్న విషయం బోధపడింది. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ, ‘జూన్ 21న హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ ప్రారంభించి 22 రోజులు చిత్రీకరణ జరిపామని, ఈ నెల 28 నుండి 20 రోజుల పాటు బెంగళూర్, ఉడిపి, గోకర్ణ, గోవాల్లో మలి షెడ్యూల్ జరుపుతామ’ని అన్నారు.

Read also : చిక్కుల్లో పడ్డ ప్రియమణి… పెళ్ళి వివాదం!

దర్శకుడు ఎం. ఎస్. రాజు మాట్లాడుతూ “సాధారణంగా ‘డర్టీ హరి’ లాంటి హిట్ చిత్రం తర్వాత మళ్లీ అదే తరహా సినిమా చేస్తారని అందరూ ఊహిస్తారు. కానీ, ‘7 డేస్ 6 నైట్స్’ అందుకు భిన్నంగా వేరే రీతిలో ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంటిల్లిపాదినీ వినోదపరిచే విధంగా చక్కటి జాలీ ట్రిప్‌లా మూవీ ఉండబోతోంది. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, విజువల్స్, మ్యూజిక్ ఈ చిత్రాన్ని డామినేట్ చేస్తాయి. సినిమాలో పాత్రలు హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? అన్నట్టు కాకుండా మన కళ్ల ముందు కదలాడే సజీవ పాత్రల్లా ఉంటాయి. అందరూ ఆ పాత్రలకు న్యాయం చేస్తున్నారు. ఇప్పటికి 60 శాతం సినిమా పూర్తయింది” అని అన్నారు. ఈ సినిమాతో సమర్థ్ గొల్లపూడి సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-