యువతలో ప్రతిభను వెలికి తీయాలి-విజయ సాయిరెడ్డి

రాష్ట్రంలో యువతలో దాగి వున్న అద్భుత మయిన ప్రతిభను, క్రీడా నైపుణ్యాలను బయటకు తీయడానికి అనేక చర్యలు చేసట్టామన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. యువతలో ఉన్న ప్రతిభ బయటకు తీయడం కోసమే వైఎస్సార్ కప్ పోటీలు ప్రారంభించామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ టోర్నమెంట్ ప్రారంభించామన్నారు.

ప్రతి ఏడాది ఈ పోటీలు జరుగుతామని, గత ఏడాది 420 టీంలు పోటీల్లో పాల్గొన్నాయన్నారు. ఈ సారి 490 టీంలు పాల్గొన్నాయి. విశాఖను క్రీడా రాజధానిగా చేయడమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగించిన రోజు ఈ పోటీలు ముగుస్తున్నాయి.జనవరి 9 వ తేదీకి రాష్ట్ర చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు విజయసాయిరెడ్డి.

ఎన్ని కష్టాలు ఎదురైన పట్టుదలతో పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారు. ప్రజలకు దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి మహిళకు వైఎస్ఆర్ కప్ పోటీలు పెడుతున్నామన్నారు. మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. యువతను ప్రోత్సాహించాలనే వైఎస్ఆర్ కప్ పోటీలు నిర్వహించామన్నారు విజయసాయిరెడ్డి.

దేశంలో ఎక్కడా ఇటువంటి పోటీలు జరగలేదు. వైఎస్సార్ కప్ లో రాణించిన వారు తప్పకుండా జాతీయస్థాయిలో రాణిస్తారు. ఈ పోటీలను చూస్తుంటే సంక్రాంతి పండగ ముందే వచ్చినట్లు ఉందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు.

Related Articles

Latest Articles