టీఆర్ఎస్‌ మహళల్ని చీట్‌ చేస్తోంది.. ఒక్కో మహిళకు రూ.10 వేలు బాకీ..!

టీఆర్ఎస్‌ ప్రభుత్వం మహిళల్ని చీట్‌ చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్‌ ఎంపీ, పీసీసీ మాజీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్‌ ప్రభుత్వంలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.. మహిళా సాధికారతకి కాంగ్రెస్ పెద్ద పీటవేసిందని.. కానీ, టీఆర్ఎస్‌ మహిళల్ని చీట్‌ చేస్తోంది.. ఒక్కో మహిళకు ఐదు నుండి 10 వేలు బాకీ ఉన్నారన్నారు. కాంగ్రెస్ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిందని గుర్తుచేసిన ఉత్తమ్.. కానీ, కేసీఆర్ సీఎం అయ్యాక… వడ్డీ లేని రుణం పరిమితి 10 లక్షలకు పెంచుతా అన్నాడు.. కానీ, ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణం ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పటి వరకు రూ.3000 కోట్లు మహిళా సంఘాలకు ప్రభుత్వం బకాయి పడిందన్నారు. అయితే, హుజురాబాద్ లో ఎన్నికలు ఉన్నాయని రూ.50 కోట్లు విడుదల చేశారని ఆరోపించారు.. ప్రభుత్వం వడ్డీలు ఇవ్వకపోగా… మహిళల నుండి వడ్డీలు వసూలు చేయాలని ఒత్తిడి పెంచుతుందని.. చెల్లించని చోట.. అధికారులను సస్పెండ్ చేస్తున్నారని మండిపడ్డారు.

Related Articles

Latest Articles

-Advertisement-