బెంగాల్ బీజేపీ చీఫ్‌గా సుకంత‌… దిలీప్ ఘోష్‌కు ప్ర‌మోష‌న్‌…!!

ప‌శ్చిమ బెంగాల్‌లో బీజేపీకి దెబ్బ‌మీద దెబ్బ తగులుతున్నాయి.  బెంగాల్ ఎన్నిక‌ల త‌రువాత తృణ‌మూల్ నుంచి వ‌చ్చిన కొంత‌మంది నేత‌లు తిరిగి ఆ పార్టీలో చేరిపోయారు.  తాజాగా మాజీకేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కూడా తృణ‌మూల్‌లో చేర‌డంతో బీజేపీ అధిష్టానం సీరియ‌స్ అయింది.  ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్‌ను త‌ప్పించి ఆ స్థానంలో ఎంపీ సుకంత మ‌జుంద‌ర్‌ను నియ‌మించింది.  వెస్ట్ బెంగాల్ చీఫ్ నుంచి పక్క‌కు త‌ప్పుకున్న దిలీప్ ఘోష్‌కు బీజేపీ జాతీయ ఉపాధ్య‌క్షుడిగా ప్ర‌మోష‌న్ ఇచ్చింది పార్టీ అధిష్టానం. జాతీయ స్థాయిలో ఆయ‌న సేవ‌లు అవ‌స‌ర‌మ‌ని, అందుకే ఆయ‌న్ను జాతీయ రాజ‌కీయాల్లోకి తీసుకుంటున్న‌ట్టు అధిష్టానం పేర్కొన్నది.  

Read: గుజ‌రాత్ ఎన్నిక‌ల‌పై ఎంఐఎం దృష్టి…

-Advertisement-బెంగాల్ బీజేపీ చీఫ్‌గా సుకంత‌... దిలీప్ ఘోష్‌కు ప్ర‌మోష‌న్‌...!!

Related Articles

Latest Articles