సూపర్ స్టార్ ను కలిసిన శశి థరూర్…

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా మహానటి కీర్తి సురేష్నటిస్తోంది. అయితే 2022 సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అయితే తాజాగా సర్కారు వారి పాట సినిమా సెట్ లో మహేష్ బాబు ను కలిశారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. ఆ సమయంలో ఎంపీ గల్లా జయదేవ్ కూడా అక్కడే ఉన్నారు. మహేష్ బాబును కలిసినట్లు శశి థరూర్ స్వయంగా ట్విట్టర్ ధ్వారా ప్రకటించారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, తివిక్రమ్ తో కలిసి సినిమా చేయనున్నారు. అనంతరం దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

Related Articles

Latest Articles

-Advertisement-