రైతు కూలీలకు అండగా ఎంపీ సంతోష్..13వ రోజు అన్నదాన కార్యక్రమం

దేశానికి వెన్నెముక లాంటి రైతులు లాక్ డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతు కూలీలకు అండగా నిలవాలని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నడుం బిగించారు. లాక్ డౌన్ పూర్తి అయ్యేంతవరకు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ లో కార్యాలయం యందు రైతులందరికీ, హమాలీ, చాట, సడెం, దడువాయి అందరికీ అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అయితే ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు మరియు నగర మేయర్ వై సునీల్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుక అనిత-ఆంజనేయులు, వైస్ ఛైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి, బోయినిపల్లి జెడ్పిటిసి కత్తెర పాక ఉమ-కొండయ్య,బోయినిపల్లి ఎంపీపీ వేణుగోపాల్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొలిపాక మల్లికార్జున్, చాట్లపల్లి పురుషోత్తం,విలసాగర్ సర్పంచ్ అంజన్ రావు, మార్కెట్ కమిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-