వైసీపీ అధికారంలోకి వచ్చాక రాక్షస పాలన సాగుతోంది…

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాక్షస పాలన సాగుతోంది. శ్రీకాకుళం జిల్లా ఉప్పినవలస ఘటనే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. అయితే సొంతింటిలో బాబాయ్ హత్య జరిగాక జగన్ రాజకీయాలు చేశారు. జగన్ ను ఆదర్శంగా తీసుకుని వైసీపీ కార్యకర్తలందరూ అరాచకం సృష్టిస్తున్నారు. ఉప్పినవలసలో పట్టపగలు కత్తులతో సినిమా స్టైల్లో దాడి చేశారు. ఇలాంటి సంస్కృతిని శ్రీకాకుళం జిల్లాకు తీసుకొచ్చిన ఘనత స్పీకర్ తమ్మినేని సీతారాంకే దక్కింది. ఆడవాళ్లను సైతం మృగాళ్లలాగా కత్తులతో నరికారు అన్నారు.

టీడీపీ అభ్యర్ధిని సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించినందుకే ఇలా చేస్తున్నారు. మంచినీళ్లు , పెన్షన్లు , చేయూత దగ్గర రాజకీయాలు చేస్తూ చంపేస్తారా… ఇలాంటికి కొనసాగిస్తే మేం చూస్తూ ఊరుకునేది లేదు. జిల్లాలోని టీడీపీ శ్రేణులందరినీ ఏకం చేసి పోరాడతాం అని తెలిపారు. తమ్మినేని కొడుకు ప్రోత్సహించడం వల్లే వైసీపీ కార్యకర్తలే చెబుతున్నారు. తమకు సంబంధం లేదన్న సీతారాం తప్పించుకోవాలనిచూస్తున్నారు. మీకు సంబంధం లేనప్పుడు …మాతో పాటు మీరు కూడా ఎస్పీ దగ్గరకు రండి. బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించండి….లేదా మీడియాలో ప్రకటన చేయండి. లోపలొకటి…బయటొకటి మాట్లాడి రాజకీయాలు చేయడం సరికాదు అని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-