వరద బాధితుల్ని తక్షణం ఆదుకోవాలి -సీఎం రమేష్

ఏపీలో భారీ వర్షాల వల్ల నష్టపోయినవారిని ఆదుకోవాలన్నారు సీఎం రమేష్. ఆంధ్రప్రదేశ్ లో గత రెండురోజులుగా కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలో వరదలు సంభవిస్తే ప్రభుత్వ చర్యలు శూన్యం. ఆస్తి, ప్రాణ నష్టం తీవ్రంగా జరిగింది. చిన్న చిన్న పనులు, పింఛా, చెయ్యేరు ప్రాజెక్ట్ ల గేటు మరమ్మత్తు పనులు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా ? అని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వ యంత్రాంగం ఉందా లేదా? అసలు ప్రభుత్వం ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కడప జిల్లాలో పలు మండలాలు వరద ముప్పు ఎదుర్కొనే పరిస్థితి ఉంటే కనీసం ప్రభుత్వంలో చలనం లేదు. రాయలసీమ లో ఎందుకు అధికారులను అప్రమత్తం చేయడం లేదు? అక్రమాలు, రాజకీయాల కోసం రాయలసీమను ప్రభుత్వం బలిపెడుతుంది. ప్రజలు కష్టాల్లో ఉంటే అసెంబ్లీ సమావేశాలు ఎందుకు వాయిదా వేయలేదన్నారు రమేష్. వరద, భారీ వర్షాల సమాచారం ప్రభుత్వానికి లేదంటే సిగ్గుచేటు. కనీస జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు. పెన్నానది, చిత్రానదీ పరీవాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కడప, రాజంపేట, కోడూరు ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయన్నాన్నారు ఎంపీ సీఎం రమేష్.

ఏపీ అసెంబ్లీలో పరిణామాలు సిగ్గుచేటు

ఏపీ శాసనసభలో శుక్రవారం జరిగిన పరిణామాలపై అంతా స్పందిస్తున్నారు. నిన్న అసెంబ్లీ లో జరిగిన పరిణామాలు సిగ్గుచేటు అన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ సభ్యుడిగా సిగ్గుపడుతున్నా అన్నారు. దేశంలో రాష్ట్రం పరువుపోతుంది. రాష్ట్రం గురించి, అసెంబ్లీ లో జరిగిన పరిణామాల గురించి దేశ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. సభ్యసమాజం సిగ్గు పడే విధంగా నిన్నటి పరిణామాలు జరిగాయి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. రాష్ట్ర అసెంబ్లీ లో ఒకప్పటి మర్యాదలు, గౌరవాలు, హందాతనం ప్రస్తుతం లేవన్నారు.

Related Articles

Latest Articles