బాక్స్ ఆఫీస్ కు పండగ… దసరా వార్ లో వరుస సినిమాలు

అక్టోబర్ లో బాక్స్ ఆఫీస్ పండగ జరగబోతోంది. ఈ రోజు మొదలుకుని దసరా బరిలో ఫైట్ కు వరుస సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ దసరాకు బాక్స్ ఆఫీస్ వార్ గట్టిగానే జరగబోతోంది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తరువాత తెలుగు రాష్ట్రాలలో ఎగ్జిబిషన్ పరిశ్రమ తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. ఇటీవల కాలంలో అనేక సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని రికార్డు స్థాయిలో కలెక్షన్లను కూడా రాబట్టాయి.

ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల సమస్య అడ్డంకిగా ఉన్నప్పటికీ టాలీవుడ్ అక్టోబర్‌లో వార్ కోసం సిద్ధమవుతోంది. సాయి తేజ్ ‘రిపబ్లిక్’ ఈ నెలలో మొదటిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం. ఈ రోజు ‘రిపబ్లిక్’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై మంచి అంచనాలు ఉండడంతో పాటు ఈ మూవీ హిట్ అవ్వడానికి సాయి తేజ్ యాక్సిడెంట్ కు గురవ్వడం, ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం వంటి అంశాలు కూడా దోహదం చేయొచ్చు.

Read Also : ‘రిపబ్లిక్’ టీంకు మెగాస్టార్ విషెస్

ఇక ఆయన సోదరుడు వైష్ణవ్ తేజ్ రెండవ చిత్రం ‘కొండ పొలం’తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు. ఈ చిత్రం అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికి క్రిష్ దర్శకత్వం వహించగా, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం అప్డేట్స్ కు మంచి స్పందన వచ్చింది. ఇక దసరా వారాంతంలో భారీ సంఖ్యలో సినిమాల ఉంటుంది. శర్వానంద్, సిద్ధార్థ్ మల్టీస్టారర్ ‘మహాసముద్రం’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం అక్టోబర్ 14 న విడుదలవుతుంది. అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అక్టోబర్ 15న రిలీజ్ అవుతోంది.

రోషన్ ‘పెళ్లి సందడి’ కూడా అక్టోబర్ 15 న విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీకాంత్ కొడుకు హీరోగా నటిస్తున్న ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. నాగ శౌర్య నటించిన ‘వరుడు కావలెను’ సినిమా అక్టోబర్ 15 న విడుదలకు సిద్ధమవుతోంది. దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ ‘రౌడీ బాయ్స్‌’తో అరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 29న విడుదల కావచ్చు.

-Advertisement-బాక్స్ ఆఫీస్ కు పండగ… దసరా వార్ లో వరుస సినిమాలు

Related Articles

Latest Articles