యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో గేమ్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి ప్లాన్ చేస్తున్న మేకర్స్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాత కొరటాల శివ, సమంత ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకు హాజరయ్యారు. ఇప్పుడు తాజా అప్‌డేట్ ప్రకారం సంగీత స్వరకర్తలు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్, యంగ్ సెన్సేషన్ తమన్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో అతిథులుగా హాట్ సీట్ ను అలంకరించబోతున్నారు.
Read Also : ముదురుతున్న ‘మా’ వివాదం.. ‘అలయ్ బలయ్’వేదికపై కూడా !
ఇప్పటికే ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ నుంచి చాలామంది ప్రముఖులను ఆహ్వానించిన ఈ షో నిర్వహకులు అనూహ్యంగా ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు డిఎస్‌పి, తమన్‌తో వినోదాత్మక ఎపిసోడ్ న్బు ప్రేక్షకుల కోసం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరికీ సంబంధించిన ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా తమన్ వెల్లడించారు. “ఈ కోసం నా ప్రియమైన జూనియర్ ఎన్టీఆర్ అన్న నేను మరియు మా స్వంత మా దేవి శ్రీ ప్రసాద్‌తో వేచి ఉండలేను. ఫన్నీన్ ఎన్ఎన్ఎన్ఎన్ఎన్ఎన్ఎన్ఎన్ మరియు చివరిలో ఎమోషనల్ ఒకటి. “అన్న ఎన్టీఆర్, ప్రియమైన మన రాక్ స్టార్ డిఎస్పీ, నేను కలిసి చేసిన ఫన్ అండ్ ఎమోషన్ తో కూడిన ఈ ఎపిసోడ్ ను చూడడానికి చాలా ఆతృతగా ఉంది” అంటూ ట్విట్టర్ లో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో సమయంలో తీసిన పిక్ ను షేర్ చేశారు.