ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెగ్గేదెలే అన్నట్లుగా బాక్స్‌ఫీస్ వద్ద బ్లాక్ బస్టార్ హిట్ కొట్టి.. పాన్ ఇండియా వైడ్‌గా రికార్డుల వర్షం కురిపించింది పుష్ప ‘ది రైజ్’ సినిమా. అయితే ఈ సినిమాలో కథనాయికగా అభినయించి రష్మికకు కూడా నేషనల్ వైడ్‌గా ఫాలోయింగ్ మరింత పెరిగింది. అయితే.. ఈ సినిమా మొదటి భాగం రికార్డుల వర్షం కురిపించడంతో.. రెండో భాగం పుష్ప ‘ది రూల్’పై ప్రత్యేక దృష్టి సారించారు దర్శకుడు సుకుమార్. ఈ నేపథ్యంలోనే పార్టు 1కి మించి పార్టు 2 ఉండేలా స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నారు. ఈ సారి సాధ్యమైనంత త్వరగా షూటింగును పూర్తి చేసేలా షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తున్నారు.
వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి, 6 నెలల్లో అన్ని పనులను పూర్తి చేసి సంక్రాంతి బరిలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది చిత్రయూనిట్. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ఈ సారి మరో హీరోయిన్ కి కూడా చోటు ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఐటమ్ సాంగ్ లో దిశా పటాని కనిపించనుందనే వార్త వినిపిస్తోంది. అయితే ఈ సారి సంక్రాంతికి గట్టి పోటీనే ఉండనుంది. చిరంజీవి ‘భోళా శంకర్’ .. పవన్ ‘ హరి హర వీరమల్లు’ .. త్రివిక్రమ్ కాంబినేషన్ లోని మహేశ్ మూవీ సంక్రాంతి దిశగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ ను కూడా ఆ దిశగానే నడిపిస్తుండటం ఆసక్తిని రేకెత్తించే విషయం.