కొరటాల శివతో ఎన్టీఆర్ చేయబోయే సినిమా.. ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా.. అని ఎదురు చూస్తున్నారు ఆభిమానులు.. అయినా అదుగో.. ఇదుగో.. అనడమే తప్పా.. ముందుకు మాత్రం కదలడం లేదు ఎన్టీఆర్ 30 సినిమా. కానీ సినీ వర్గాలు మాత్రం అలా చేస్తున్నారు.. ఇలా చేస్తున్నారంటూ తెగ ఊరిస్తున్నారు. ఇదొక్కటే కాదు.. ఎన్టీఆర్ ఓ తమిళ్ దర్శకుడికి కూడా ఓకే చెప్పినట్టు వార్తలొస్తున్నాయి.. ఇంతకీ భారీ సెట్టింగ్ మరియు కోలీవుడ్ డైరెక్టర్ అసలు కథేంటి..!
ఎన్టీఆర్-కొరటాల ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి సవంత్సరం.. మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి నెలలు గడుస్తున్నా.. షూటింగ్ మాత్రం స్టార్ట్ అవడం లేదు. జూన్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారని.. చాలా రోజులుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్టేట్ లేదు. దీనికి ఎన్నో కారణాలు వినిపిస్తున్నాయి. ఆచార్య సెటిల్మెంట్.. ఎన్టీఆర్30 స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులపైనే.. కొరటాల కసరత్తులు చేస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఎట్టకేలకు ఆగష్టులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనునందని సమాచారం. అయినా ఇప్పుడే దీన్ని ఫైనల్ చేయలేమంటున్నారు. అయితే ఈ సినిమాను హైప్ పెంచే పుకార్లు మాత్రం షికార్లు చేస్తునే ఉన్నాయి. తాజా అప్టేట్ ప్రకారం.. ఈ చిత్రంలో ఓ కీలక ఎపిసోడ్ కోసం భారీ సెట్‌ను నిర్మిస్తున్నారట.
ఆ సెట్‌లోనే ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం భారీ యాక్షన్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఇదిలా ఉండగానే.. ఇప్పటికే ప్రశాంత్ నీల్‌తో 31 ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇటీవలె ఎన్టీఆర్‌ను కలిసి వెట్రిమారన్ ఓ కథను వినిపించారనే వార్త వైరల్ అయింది. అయితే అలాంటిదేం లేదని.. గతంలో ఎప్పుడో ఎన్టీఆర్, వెట్రిమారన్ కలిసారని, అప్పుడు కూడా స్టోరీ డిష్కషన్స్ జరగలేదని.. ఇవన్నీ కేవలం రూమర్సేనని అంటున్నారు. అయితే ఒకవేళ ఈ కాంబో సెట్ అయితే మాత్రం.. ఓ రేంజ్‌లో ఉంటుందని చెప్పొచ్చు. ఏదేమైనా నిజనిజాలేంటో తెలియదుగానీ.. ఎన్టీఆర్ సినిమాల గురించి మాత్రం రోజుకో వార్త హల్ చల్ చేస్తోందని చెప్పొచ్చు.