WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • F3 Movie
  • Petrol rates
  • Congress Rachabanda
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Movie News Ms Narayana Has Earned A Place In The Hearts Of The Telugu Audience With His Comedy

నవ్వుల చిందుల.. నారాయణ

Updated On - 07:41 AM, Sun - 23 January 22
By Vinod Kumar
నవ్వుల చిందుల.. నారాయణ

“కళ్ళ కింద క్యారీ బ్యాగులు…” ఉంటేనేం, కామెడీతో కబడ్డీ ఆడగలిగే సత్తా ఉంటే చాలు, నందులు నడచుకుంటూ రావలసిందే! అంతటి ధీమాతోనే ఎమ్.ఎస్.నారాయణ నవ్వులు పూయించారు. అందువల్లే ఎమ్మెస్ నారాయణను ఐదు సార్లు బెస్ట్ కమెడియన్ గా నంది అవార్డులు వరించాయి. ఎమ్మెస్ నారాయణ తెరపై కనిపిస్తే చాలు, అసంకల్పితంగా ప్రేక్షకుల పెదాలు విచ్చుకొనేవి. ఇక ఆయన కదిలితే చాలు జనానికి చక్కిలిగింతలు కలిగేవి. నోరు విప్పి మాట్లాడితే కితకితలే!

పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడమర్రులో 1951 ఏప్రిల్ 16న నారాయణ జన్మించారు. బాల్యం నుంచీ రివటలా ఉండే ఎమ్మెస్ నారాయణ తన చేష్టలతో చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ ఉండేవారు. చదువుకొనే రోజుల్లో మిత్రులకు నవ్వులు పంచారు. ఆపై నాటకాలపై మనసు పారేసుకొని నటనతోనూ ఆకట్టుకున్నారు. కొన్ని నాటకాలు రాసి, వాటికి దర్శకత్వం వహించి, మిత్రులతోనూ నటింపచేసి ఆనందించారు ఎమ్మెస్. చదువు పూర్తయ్యాక లెక్చరర్ గా పనిచేస్తూనే, మళ్ళీ నటనపై మనసు పారేసుకున్నారు. అదే ఆయనను సినిమా రంగంవైపు పరుగులు తీయించింది. సుమన్ హీరోగా నటించిన ‘అలెగ్జాండర్’లో తొలిసారి తెరపై కనిపించారు ఎమ్మెస్ నారాయణ. అదేమి అంత గుర్తింపు సంపాదించి పెట్టలేకపోయింది. తరువాత దర్శకుడు రవిరాజా పినిశెట్టితో దోస్తీ కుదిరింది. ఆయన రూపొందించిన ‘ఎమ్.ధర్మరాజు ఎమ్.ఏ., పెదరాయుడు” చిత్రాలలోనూ నటించారు ఎమ్మెస్. అడపాదడపా తెరపై కనిపిస్తున్నా ఎమ్మెస్ నారాయణకు అంతగా గుర్తింపు రాలేదు. ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ‘మా నాన్నకి పెళ్ళి’లో తాగుబోతుగా నటించి భలేగా మెప్పించారు. ఆ తరువాత మరి వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎమ్మెస్ నారాయణ నవ్వుల ప్రయాణం సాగించారు. ఆ పయనంలో నవ్వుల పువ్వులు పంచుతూ ముందుకు పోయారు. “మా నాన్నకి పెళ్ళి, రామసక్కనోడు, సర్దుకు పోదాం రండి, శివమణి, దూకుడు” చిత్రాలు ఆయనకు నంది అవార్డును సంపాదించి పెట్టాయి.

ఎమ్మెస్ నారాయణ పర్సనాలిటీని బట్టి, ఆయనతో పలువురు దర్శకులు పేరడీలు చేయించారు. ముఖ్యంగా ‘దూకుడు’లో దర్శకుడు శ్రీను వైట్ల ఆయనతో చేయించిన పేరడీలు తెలుగువారిని విశేషంగా అలరించాయి.

చదువుకొనే రోజుల్లోనే నాటకాలు రాసి, దర్శకత్వం నెరపిన ఎమ్మెస్, “కొడుకు, భజంత్రీలు” అనే చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీటిలో ‘కొడుకు’ చిత్రంలో నారాయణ కుమారుడు విక్రమ్ హీరోగా నటించాడు. కొన్ని చిత్రాలకు రచన కూడా చేసిన నారాయణ, నవ్వుల తోటలోనే అధికంగా గడిపారు. కేవలం 17 సంవత్సరాలలో 700 పైచిలుకు చిత్రాలలో నటించి ఓ రికార్డు నెలకొల్పారు. ఇప్పటికీ ఎమ్మెస్ నారాయణ పేరు వినగానే ఆయన నటించిన పాత్రలే గుర్తుకు వచ్చి నవ్వులు మన సొంతమవుతాయి. ప్రస్తుతం ఎమ్మెస్ నారాయణ భౌతికంగా లేకపోయినా, ఆయన పంచిన నవ్వులు నిత్యం మన మదిలో చిందులు వేస్తూనే ఉంటాయి.

  • Tags
  • Comedian
  • latest movie news
  • movie news
  • MS Narayana
  • telugu actor

RELATED ARTICLES

D Imman : రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌

Tollywood: తెలుగు సినిమాపై జస్టిస్ ఎన్‌వీ రమణ సంచలన వ్యాఖ్యలు

LIVE:సర్కారు వారి పాట ప్రెస్ మీట్

Dhanush: ఇర‌వై ఏళ్ళ న‌ట‌విరాట్ … ధ‌నుష్!

Avatar-2: అదరగొడుతున్న టీజర్ ట్రైలర్.. మరో ఊహాలోకంలోకి..!!

తాజావార్తలు

  • Viral Video: రైలు ఎక్కిన వందలాది ఆర్టీసీ బస్సులు

  • Botsa Satyanarayana: చంద్రబాబుకు ఏపీలో పర్మినెంట్ అడ్రస్ ఉందా?

  • IPL 2022: సన్‌రైజర్స్ మోస్తరు స్కోరు.. చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ గెలిచేనా?

  • R Krishnaiah: రాజ్యసభ పదవి వెనుక కేసీఆర్ హస్తం?

  • Andhra Pradesh: కోనసీమ జిల్లాలో వారం పాటు 144 సెక్షన్

ట్రెండింగ్‌

  • Trai New Plan: ఇకపై ఎవరు కాల్ చేశారో ఈజీగా తెలుసుకోవచ్చు

  • Airtel Plans : మరోసారి వినియోగదారులకు షాక్‌.. పెరుగనున్న రీఛార్జ్‌ ధరలు..

  • Qutub Minar : తెరపైకి మరో వాదన.. కుతుబ్‌ మినార్ నిర్మించింది రాజా విక్రమాదిత్య..

  • WhatsApp Pay : కీలక నిర్ణయం.. ఇక నుంచి చెల్లింపుల్లో ఒరిజినల్‌ పేరు..

  • Optical Illusion : మీ వ్యక్తిత్వాన్ని తెలిపే ఫోటో.. ఓ లుక్కేయండి..!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions