లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో.. కమల్ హాసన్ హీరోగా, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో.. సూర్య గెస్ట్ రోల్ పోషించిన ‘విక్రమ్’ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపింది. కెజీయఫ్ చాప్టర్ 2 తర్వాత.. పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా.. భారీ విజయం అందుకుంది. చాలా కాలం తర్వాత కమల్‌కి పెద్ద హిట్ రావడంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. దాంతో ఈ సినిమాకి పని చేసిన వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్స్, పార్టీలు ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే.. కమల్ ఈ సినిమా విజయాన్ని ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంతేకాదు ఈ సినిమా తన అప్పులన్నిటినీ తీర్చేసిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలాగే ఇకపై.. తన నుంచి లోకేశ్ కనగరాజ్‌కి ఎలాంటి సహాయం కావాలన్నా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే లోకేష్‌కి కోటి రూపాయల ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఒక్క తమిళనాడులోనే 150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. బాహుబలి రికార్డ్ బద్దలు కొట్టినట్టు తెలుస్తోంది. కోలీవుడ్‌లో ఇప్పటి వరకు 146 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా బాహుబలి 2 ఉంది. అయితే తాజాగా విక్రమ్.. బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న ఈ సినిమా.. మొత్తంగా తమిళ్‌లో దాదాపు 175 నుంచి 180 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉందంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక ఈ సినిమాను థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు.. ఓటీటీ టైం కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందులోభాగంగా ఈ నెల 3న రిలీజైన విక్రమ్.. జూలై 8న ప్రముఖ డిజిటల్ సంస్థ ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుందని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తోంది. మరి థియేటర్లో రచ్చ చేసిన విక్రమ్.. ఓటిటిలో ఎప్పుడొస్తాడో చూడాలి.