Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vrushakarma OTT Deal: ఒక సినిమా విడుదలకు ముందే ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. కథపై నమ్మకం, దర్శకుడి విజన్, హీరో క్రేజ్, నిర్మాత ధైర్యం అన్నీ కలిసొస్తేనే అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నాగ చైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ విషయంలో కూడా అదే కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. థియేటర్లలోకి రాకముందే ఈ చిత్రం డిజిటల్, శాటిలైట్ ఒప్పందాన్ని భారీ ధరకు కుదుర్చుకుందనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తాండెల్’ విజయంతో మంచి జోష్‌లో ఉన్న నాగ చైతన్య, తన కెరీర్లో పూర్తిగా భిన్నమైన కథను ఎంచుకుని ‘వృషకర్మ’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. మిస్టిక్ అంశాలు, పౌరాణిక నేపథ్యం, థ్రిల్లింగ్ కథనంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా చైతన్య మరో కొత్త అవతార్‌లో కనిపించనున్నారని ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ స్పష్టంచేసింది. గ్లింప్స్‌లో కనిపించిన విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మేకింగ్ క్వాలిటీ సినిమాపై భారీ అంచనాలను తీసుకొచ్చాయి.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘విరూపాక్ష’తో దర్శకుడిగా తన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫాంటసీ, మైథాలజీ, థ్రిల్లర్ అంశాలను కలగలిపిన కథతో ఆయన మరోసారి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా ఊహించని స్థాయిలో జరుగుతోందని సమాచారం. ప్రస్తుతం ఓటీటీ, శాటిలైట్ మార్కెట్లో కొంత మందగమనం కనిపిస్తున్నప్పటికీ, ‘వృషకర్మ’ మాత్రం ఆ పరిస్థితిని అధిగమించినట్లు టాక్ వినిపిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం, జీ టీవీ సంస్థ ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను దాదాపు రూ.50 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన ఇంకా రానప్పటికీ, ఈ వార్త మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read
ఈ డీల్ నిజమైతే నాగ చైతన్య కెరీర్లో ఇదే అతిపెద్ద నాన్ థియేట్రికల్ ఒప్పందంగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ‘వృషకర్మ’ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. విజువల్‌గా గ్రాండ్‌గా దీన్ని మేకర్స్ తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. ఇప్పటికే గ్లింప్స్‌తో అంచనాలు పెంచిన ఈ సినిమా, ఇప్పుడు భారీ డిజిటల్ డీల్ వార్తలతో మరింత హైప్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం మాత్రం ‘వృషకర్మ’ టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటిగా మారిందనే చెప్పాలి.
- Tags
- cinema
- Vrushakarma
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..