మోహన్ బాబు కుటుంబ వివాదం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఈ కుటుంబ వ్యవహారం గురించి అనేక వార్తలు తెరమీదకు వస్తున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం ఇప్పటికే మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన నివాసానికి వచ్చి పది మంది దుండగులు దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. మంచు కుటుంబం గురించి కానీ మోహన్ బాబు గురించి గానీ ఆ ఫిర్యాదులో ఎలాంటి మెన్షన్ చేయలేదు. కానీ ఇప్పుడు తాజాగా మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ కు లేఖ రాసి మరో సంచలనానికి కేంద్ర బిందువుగా మారారు. తన కుమారుడు మంచు మనోజ్ కోడలు మౌనికపై మోహన్ బాబు లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ కు మోహన్ బాబు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.
Rajendra Prasad: వాడెవడో చందనం దొంగ.. వాడు హీరోనా?..పుష్ప 2పై రాజేంద్ర ప్రసాద్ సంచలనం
మౌనిక, మనోజ్ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో మోహన్ బాబు పేర్కొన్నారు. కాబట్టి పోలీసుల ద్వారా రక్షణ కల్పించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ ను మోహన్ బాబు కోరారు. మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతిలో ఉంది, దాని పంపకాల వ్యవహారంలోనే కుటుంబంలో మనస్పర్థలు తలెత్తాయని ముందు వార్తలు వచ్చాయి. అయితే అదేమీ లేదని మీడియాలో వస్తున్న వార్తలు కరెక్ట్ కాదని మోహన్ బాబు పి.ఆర్ టీం ఖండించింది. మోహన్ బాబు కుటుంబం తరఫున ఏదైనా ఉంటే తామే ప్రకటిస్తామని మిగతా ఎలాంటి ప్రచారం జరిగినా అది నిజమని నమ్మాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది.