“ఉప్పెన” బ్యూటీ కృతి శెట్టి ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ఒకే ఒక్క చిత్రంతో స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది ఈ చిన్నది. ప్రస్తుతం తెలుగులో దాదాపు నాలుగు సినిమాలు చేస్తోంది కృతి. ఈ బ్యూటీఫుల్ బేబీకి ఎక్కువగా అబ్బాయిలు ఫిదా అయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు యూత్ అంతా కృతిశెట్టిని తమ కలల రాణిగా భావిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి తనకు జీవిత భాగస్వామిగా రాబోయే వ్యక్తి ఎలా ఉండాలో చెప్పేసింది. తనకు అబద్ధం చెప్పే అబ్బాయిలంటే అస్సలు నచ్చదని, నిజాయితీగా ఉండాలని, ఏదైనా తన ముఖం మీదే చెప్పే ధైర్యం ఉండాలని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శృతి హాసన్ ‘శ్యామ్ సింగ రాయ్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే చిత్రాల్లో నటిస్తోంది.