ద ఫ్యామిలీ మ్యాన్ 2 సీరీస్ ఆన్ లైన్ స్ట్రీమింగ్ డేట్ కన్ ఫామ్ అయింది. జూన్ 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సీరీస్ ప్రసారం కానుంది. తొలి సీరీస్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో రెండో సీజన్ పై మంచి హైప్స్ నెలకొన్నాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన ట్రైలర్ మరింత ఆసక్తిని పెంచింది. ఈ రెండో సీజన్ లో సమంత నటించటం… అదీ నెగెటీవ్ పాత్ర కావటం దక్షిణాది ఆడియన్స్ లో ఎంతో ఉత్సుకత నెలకొంది. ఇక ట్రైలర్ లో సమంత ఎల్.టి.టి.ఇ సానుభూతి పరురాలిగా చూపించటంతో అది పీక్స్ చేరింది. దానిని ఉగ్రవాద సంస్థగా చూపించి ఆ తర్వాత నిరసనలు తలెత్తటంతో రీ ఎడిట్ చేయటం వంటి అంశాలతో అందరూ ఎంతో ఉత్కంఠతో జూన్ 4 కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఆడియన్స్ లో మరింత ఉత్సాహాన్ని నింపే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కూడా ఉంటుందనేది. ఈ సీరీస్ తీస్తున్న దర్శకులు రాజ్, డి.కె ఈ విషయాన్ని స్వయంగా రిలీవ్ చేయటం గమనార్హం. అంతే కాదు మూడో సీజన్ మరింత బిగ్గర్ గా ఉంటుందట. ఇప్పుడున్న తారలతో పాటు ఈ మూడో సీజన్ లో ఇంకా పెద్ద తారల ఎంట్రీ ఉంటుందంటున్నారు. చూద్దాం మరి మూడో సీజన్ లో ఎంట్రీ ఇచ్చే ఆ బడా స్టార్స్ ఎవరో!