NTV Telugu Site icon

Devara : మరొక మైలురాయిని చేరుకున్న దేవర.. ప్రీమియర్స్ ఈ రోజే

Untitled Design (23)

Untitled Design (23)

జూనియర్ ఎన్టీఆర్‌ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. థియేటర్లో దూకేందుకు ఎదురు చూస్తుంది.  ఇప్పటికే తెలుగు రాష్టాల బుకింగ్స్ దంచికొడుతున్నాయి. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్  నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీత సారథ్యంలో వస్తున్న దేవర ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఓవర్సీస్ లోను భారీ ఎత్తున రిలీజ్ కానుంది దేవర.  ఇక దేవర ఒవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఉహింహిచిన దాని కంటే ఎక్కువ రాబట్టాయి.

Also Read : OTT – ఈ వారంలో స్ట్రీమింగ్ కానున్న ఓటీటీ సినిమాలు, వెబ్ సీరిస్ లిస్ట్…

దేవర ఉత్తరఅమెరికాలో 3 మిలియన్ డాలర్ల మార్కును దాటింది ఇప్పటివరకు ప్రీమియర్ల ద్వారా వచ్చిన మొత్తం: $2.4M, డే – 1
: $600K కలెక్ట్ చేసి మొత్తంగా M మార్క్ ను అందుకుంది దేవర. అలాగే టికెట్స్ పరంగా దేవర రికార్డు సృష్టించింది. గురువారం నాటికి దేవర 1,00,000 టిక్కెట్లు ప్రీ-సేల్స్‌తో విక్రయించబడ్డాయి. ప్రీమియర్స్ రూపంలోకి అత్యధిక ప్రీమియర్స్ గ్రాస్ రాబట్టిన సినిమాలలో ఆల్ టైమ్ టాప్-3 లో దేవర కొనసాగుతోంది. ఇంక దేవర దర్శనానికి మరికొద్ది గంటలు మాత్రమే ఉన్నాయి. 26న గ్రాండ్ ప్రీమియర్స్ లో విడుదల కానుంది దేవర. ఇప్ప్పటికే మూడు మిళియన్స్ రాబట్టిన దేవర ఫస్ట్ వీకెండ్ నాటికి $5 మిలియన్ రాబట్టే అవకాశం ఉంది. 6 ఏళ్ల తర్వాత యంగ్ టైగర్ సినిమా సోలో రిలీజ్ కానుంది, టాక్ ఎలా ఉన్న సరే దేవర కలెక్షన్స్ మాత్రం కాస్త భారీ నంబర్స్ ఉండే అవకాశం ఉంది