NKR 21 : అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఏడాది కాలంగా షూటింగ్ దశలోనే ఉన్నఈ సినిమా ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కల్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు.
‘‘కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గా తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమాకు ఇటీవల ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ పవర్ఫుల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సీనియర్ నటి విజయశాంతి నటిస్తున్నారు. ఆమె కొడుకుగా కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ టీజర్ ను ఈ నెల 14న రిలీజ్ చేయబోతున్నారు. ఆ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ కళ్యాణ్ రామ్ పవర్ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. అర్జున్ సన్నాఫ్ వైజయంతిని ఏప్రిల్ 17 లేదా 18న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాతలు. ఇక ఈ మూవీలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాకు కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.
Also Read
- NANI : నాని ఫ్యాన్స్‌కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
తాజావార్తలు
-
Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
-
Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
-
Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్‌నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.