Bandla Ganesh: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తాజా ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొని సంచలనం విషయాలను పంచుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో తాను రెండు సూపర్ హిట్స్ ఇచ్చినట్లు చెప్పారు. బాద్‌షా సినిమా రిలీజ్‌కు ముందు ఆయన ప్లాప్స్‌లో ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో అప్పటి వరకు ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాద్‌షా నిలిచిందని వెల్లడించారు. ఆ సినిమా తర్వాత హీరో కెరీర్‌లో వరుసగా రెండు ప్లాప్స్ సినిమాలు పడ్డాయని అన్నారు.
ఆ తర్వాత హీరో ఎన్టీఆర్‌తో టెంపర్ అనే ఒక బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని తీసినట్లు గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా కథ వక్కంతం వంశీ తనకు చెప్పగానే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని తనతో చెప్పినట్లు వివరించారు. తానే ఈ సినిమా కథను డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దగ్గరికి తీసుకెళ్లి పార్క్ హైయత్‌లో వినిపించినట్లు చెప్పారు. ఆ టైంలో పూరీ జగన్నాథ్ ఈ కథ వినగానే ఈ సినిమా నీ కెరీర్‌లో మరో గబ్బర్ సింగ్ అవుతుందని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. టెంపర్ లాంటి సినిమా ఇప్పుడు తీస్తే రూ.1000 కోట్ల వసూళ్లు గ్యారెంటీగా సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాలో హీరో తన నటనతో అదరగొట్టినట్లు చెప్పారు. టెంపర్ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో హీరోగా ఎన్టీఆర్ నటించారు. ఆయన సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా అలరించారు. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించగా, వక్కతం వంశీ కథను అందించారు. ఇది 2015 లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మించారు.
