Avika Gor: “ఆయనతో స్క్రీన్ షేర్ చేయడం నా డ్రీమ్”.. నానిపై అవికా గోర్ మనసులో మాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani) నటనకు, ఆయన ఎంచుకునే వైవిధ్యమైన కథలకు టాలీవుడ్లోనే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కేవలం ప్రేక్షకులు, అభిమానులే కాదు.. పరిశ్రమలోని తోటి నటీనటులు సైతం నాని యాక్టింగ్ స్టైల్‌కు పెద్ద ఫ్యాన్స్ అయిపోతుంటారు. తాజాగా ప్రముఖ యంగ్ బ్యూటీ, హోమ్లీ హీరోయిన్ అవికా గోర్ (Avika Gor) నేచురల్ స్టార్ నానిపై చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
రాజ్ తరుణ్ సరసన ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి, తొలి చిత్రంతోనే నటిగా అందరి మనసులు గెలుచుకుంది అవికా గోర్. ఆ తర్వాత ‘సినిమా చూపిస్త మావ’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఆమె నటించిన ‘అగ్లీ స్టోరీ’ (Ugly Story) చిత్రం థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న తరుణంలో.. ఒక ఇంటర్వ్యూలో నానిపై ఆమె కురిపించిన ప్రశంసల వర్షం ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన ఒక టాక్ షో ఇంటర్వ్యూలో అవికా గోర్‌కు యాంకర్ నుండి ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది.. ‘మీ కెరీర్ మొత్తంలో ఒకే ఒక్క హీరోతో కేవలం మూడు సినిమాలు మాత్రమే చేసే ఛాన్స్ వస్తే.. మీరు ఏ టాలీవుడ్ హీరోని ఎంచుకుంటారు?” దీనికి అవికా గోర్ అస్సలు ఆలస్యం చేయకుండా, క్షణం కూడా ఆలోచించకుండా ‘నేచురల్ స్టార్ నాని’ పేరు చెప్పింది.
Also Read
‘నాని గారి కళ్లు చాలా మాట్లాడతాయి. తెరపై ఆయన భావాలను పలికించే విధానం, ఆ నటనలోని లోతు (Depth) నన్ను బాగా ఆకర్షించాయి. ఆయన ప్రదర్శన చూస్తుంటే అందులో ఎన్నో లేయర్స్ ఉన్నట్లు అనిపిస్తుంది. నాకు ఎప్పుడూ నటనలో అలాంటి సహజత్వం అంటే చాలా ఇష్టం. అందుకే ఆ అవకాశం వస్తే కచ్చితంగా నాని గారినే ఎంచుకుంటాను’ అని అవికా తన మనసులోని మాటను బయటపెట్టింది. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి, కేవలం తన టాలెంట్‌తోనే నేచురల్ స్టార్‌గా ఎదిగిన నాని నటనకు అవికా ఇచ్చిన ఈ అల్టిమేట్ ట్రిబ్యూట్ మెగా అండ్ నాని ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. భవిష్యత్తులో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఏదైనా పవర్ఫుల్ పీరియడ్ లేదా ఎమోషనల్ డ్రామా వస్తే చూడాలని అటు సినీ విశ్లేషకులు, ఇటు సాధారణ ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Avika Gor: “ఆయనతో స్క్రీన్ షేర్ చేయడం నా డ్రీమ్”.. నానిపై అవికా గోర్ మనసులో మాట
-
Gurindervir Singh: భారత అత్యంత వేగవంతమైన రన్నర్‌గా గురిందర్‌వీర్ సింగ్ నయా రికార్డు.. 10.09 సెకన్లలో 100 మీటర్లు పూర్తి
-
Pakistan: పాకిస్తాన్లో రక్తపాతం.. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై బీఎల్ఏ దాడి.. 23 మంది దుర్మరణం
-
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ .. ‘హెల్లాళ్లాలో’ వీడియో సాంగ్ అవుట్!
-
MI vs RR: వాంఖడేలో హోరాహోరీ పోరు.. ముంబై vs రాజస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో ఎవరిది పైచేయి?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?