ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేశ్ పుట్టినరోజు. ఆ రోజు మహేశ్ నటిస్తున్న ‘సర్కారు వాటి పాట’ కు సంబంధించి స్పెషల్ అప్ డేట్ తో పాటు ట్విటర్ స్పేసెస్ లో స్పెషల్ ఆడియో లైవ్ సెషన్ ప్లాన్ చేస్తోంది మహేశ్ అండ్ టీమ్. ఈ ట్విటర్ స్పేసెస్ ఫీచర్ ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రముఖు పుట్టిరోజుతో పాటు పలు సెలబ్రేషన్స్ టైమ్ లో ట్విటర్ స్పేసెస్ ఆడియో సెసెన్స్ నిర్వహిస్తూ వస్తున్నారు. మనదేశంలో ఇపుడిపుడే ఈ ఫీచర్ గుర్తింపుకు నోచుకుంటోంది. ఇటీవల కాలంలో ధనుష్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఆడియో సెసెన్స్ లైవ్ కి మంచి స్పందన లభించింది. ధనుష్ తో పని చేసిన పలువురు తారలు, దర్శకులు ఆ లైవ్ లో పాల్గొనటంతో అభిమానులు కూడా రెట్టించిన ఉత్సాహంతో పార్టిసిపేట్ చేశారు. దాంతో 27 వేలమందికి పైగా పార్టిసిపెంట్స్ తో ఆ ఈవెంట్ బిగ్గెస్ట్ స్పేస్ లైవ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డ్ పై కన్నేసింది సూపర్ స్టార్ మహేశ్ టీమ్.
Read Also : ‘ఆర్ఆర్ఆర్’ సెట్స్ మీద మళ్లీ ఒలివియా!
ఆగస్ట్ 9న మహేవ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సాయంత్రం ఏడుగంటకు ట్విట్టర్ లో బిగ్గెస్ట్ సెలబ్రెటీ లైవ్ సెక్షన్ ప్లాన్ చేశారు. మహేశ్ తో పని చేసిన 20 మంది సెలబ్రెటీలు ట్విటర్ స్పేసెస్ ఆడియో సెసన్స్ లో పాల్గొని మహేశ్ తో తమకున్న అనుబంధాన్ని షేర్ చేసుకోబోతున్నారు. ఈ ఈవెంట్ కోసం మహేవ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తోంది. అధిక సంఖ్యలో ఈ సెసన్స్ లో పాల్గొని ధనుష్ పేరిట ఉన్న రికార్డ్ ను బద్దలు కొట్టటానికి ప్లాన్ వేస్తున్నారు. మరి మహేశ్ అండ్ టీమ్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంత వరకూ విజయవంతం అవుతుందో చూడాలి.