టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కొంతమంది సెలెబ్రిటీలను ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. డ్రగ్స్, మనీలాండరింగ్ కోణంలో ఈ విచారణ సాగింది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ కు ఉచ్చుబిగుస్తోంది. కెల్విన్ కీలక నిందితుడిగా ఈడీ అధికారులు గుర్తించారు. తాజాగా డ్రగ్స్ కేసులో కెల్విన్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబరు 9న విచారణకు హాజరు కావాలని రంగారెడ్డి జిల్లా కోర్టు కెల్విన్ ను ఆదేశించింది. ఎక్సైజ్ శాఖ ఛార్జ్ షీట్ లో కెల్విన్ కు కోర్టు సమన్లు జారీ చేసింది. ఇప్పటికే పలుమార్లు కెల్విన్ ను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.