స్పూన్‌తో సొరంగం తవ్వారు.. జైలు నుంచి పరారయ్యారు..!

జైలు అంటేనే పటిష్టమైన భద్రత ఉంటుంది.. ఇక, ఇజ్రాయెల్‌ లాంటి దేశంలో అయితే మరింత పకడ్బంది చర్యలు ఉంటాయి.. కానీ, ఒక స్పూన్‌ సహాయంతో జైలు నుంచి ఉగ్రవాదులు పరారయ్యారు.. స్పూన్‌ సహాయంతో జైలు నుంచి సొరంగాన్ని తవ్వారు.. ఆ తర్వాత ఒక సాధారణ ఖైదీ సహా.. ఐదుగురు ఇస్లామిక్‌ జిహాదీలు జైలు నుంచి పరారయ్యారు. ఇక, ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ జైళ్ల శాఖ కమిషనర్‌ కేటీ పెర్రీ కూడా అంగీకరించారు.. పారిపోయిన ఖైదీలంతో ఒకే సెల్‌లో ఉన్నారని.. సెల్‌లో ఉన్న సింక్‌ కిందిభాగంలో సొరంగం తవ్వి తప్పించుకున్నారని తెలిపారు. సెల్‌ నుంచి కొంత దూరం సొరంగం తవ్వారని, జైలు గోడల వెనుక భాగం నుంచి పరారయ్యారని వెల్లడించారు. అయితే, తప్పించుకున్నవారి కోసం వేట కొనసాగుతోందని తెలిపారు.. ఈ ఘటనతో అప్రమత్తమైన జైలు అధికారులు.. ఎక్కడ ఏ బొక్క ఉందనుకున్నారో ఏమో.. ఆ జైళ్లో ఉన్న 400 మంది ఖైదీలను మరో జైలుకు తరలించారు. మొత్తంగా ఒక స్పూన్‌ సహాయంతో సొరంగం తవ్వి.. జైలు నుంచి తప్పించుకోవడం చర్చగా మారింది.

Related Articles

Latest Articles

-Advertisement-