ప్రకాశ్‌ రాజ్‌ కు సినీ నటి పూనమ్ కౌర్ మద్దతు

మా అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక గడువు దగ్గర పడుతున్న కొద్ది.. అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. వరుసగా ప్రెస్‌ మీట్లు పెట్టి.. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మా అధ్యక్ష ఎన్నికల పై సినీ నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేసింది. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ గెలవాలని తాను కోరుకుంటున్నానని ప్రకటించింది పూనమ్‌ కౌర్‌.

తాను చాలా కాలం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను ప్రకాష్ రాజ్ కు విన్న విస్తానని… చెప్పిన ఆమె… ప్రకాష్ రాజ్ మాత్రమే వాస్తవికంగా ఉంటాడని కుండ బద్దలు కొట్టింది. ప్రకాశ్ రాజ్ పెద్దల పట్ల గౌరవాన్ని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడని చెప్పుకొచ్చింది పూనమ్‌ కౌర్‌. ప్రకాశ్ రాజ్ చెత్త రాజకీయాలు చేయరని.. అందుకే ఆయనకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది పూనమ్‌. కాగా.. ‘మా’ ఎన్నికలకు తేదీ ఖరారు అయిన విషయం తెల్సిందే. అక్టోబర్ 10 న మా ఎన్నికలు జరుగనున్నాయి.

-Advertisement-ప్రకాశ్‌ రాజ్‌ కు సినీ నటి పూనమ్ కౌర్ మద్దతు

Related Articles

Latest Articles