ఇంటి నుంచి బయటకు వెళ్లిన మౌనిక.. ఇంకా రాలేదు

ఇంటి నుండి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన సరూర్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం చంపాపేట గాంధీ విగ్రహం కుమ్మరి బస్తీ ప్రాంతానికి చెందిన మౌనిక (22) ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. ఆమె డిసెంబర్‌ 2న మధ్యాహ్నం ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.

ఆమె కోసం బంధువులు, స్నేహితుల వద్ద కూడా వెదికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు సరూర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Related Articles

Latest Articles