కాకీనాడ మేయ‌ర్‌పై అవిశ్వాసం… ప‌ద‌వి కోల్పోయిన సుంక‌ర పావ‌ని…

కాకినాడ మున్సిప‌ల్ కార్పోరేష‌న్లో టీడీపీకి షాక్ త‌గిలింది. టీడీపీ మేయ‌ర్‌పై ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూంగా 36 ఓట్లు వ‌చ్చాయి. అయితే, పావ‌నికి అనుకూలంగా ఒక్క‌రు కూడా చేతులు ఎత్త‌క‌పోవ‌డంతో అవిశ్వాసం నెగ్గింది. మొత్తం 50 డివిజ‌న్లు ఉన్న కాకినాడ మేయ‌ర్ కార్పోరేష‌న్‌కు 2017లో ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీకి 30, వైసీపీ 8, బీజేపీ 3, స్వ‌తంత్రులు 3 చోట్ల విజ‌యం సాధించారు. ఎన్నిక‌ల త‌రువాత న‌లుగురు మృతి చెంద‌డంతో ఆ సంఖ్య 44కి చేరింది. కాగా, ఈ అవిశ్వాస తీర్మానంలో ఒక్క‌రు కూడా మేయ‌ర్‌కు అనుకూలంగా ఓటు వేయ‌క‌పోవ‌డం విశేషం. ఈ ఓటింగ్‌లో మంత్రి క‌న్న‌బాబు, ఎంపీ వంగ గీత‌, ఎమ్మెల్యే ద్వారంపూడిలు కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు కాకినాడ మేయ‌ర్ ను ఎలాగైనా సొంతం చేసుకోవాల‌ని వైసీపీ చూస్తున్న‌ది. మ‌రి ఈ వ్యూహం ఫ‌లిస్తుందా చూడాలి.

Read: వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌: త్వ‌ర‌లో మ‌రో రెండు తుఫాన్లు…

-Advertisement-కాకీనాడ మేయ‌ర్‌పై అవిశ్వాసం... ప‌ద‌వి కోల్పోయిన సుంక‌ర పావ‌ని...

Related Articles

Latest Articles