చిచ్చు రేపిన అక్రమ సంబంధం : కన్న కొడుకును కొట్టి చంపిన తల్లి

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల భగత్ సింగ్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. కన్న కుమారుడిని కొట్టి చంపింది ఓ తల్లి. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సొంత కొడుకునే చంపింది. అసలు వివరాల్లోకి వెళితే.. గత రెండేళ్లుగా భర్త సురేష్ ను కాదని మరో వ్యక్తితో భగత్ సింగ్ నగర్లో నివాసం ఉంటుంది తల్లి ఉదయ. అయితే భర్త సురేష్ పై కోపంతో ఇవాళ ఉదయం బాలుడు ఉమేష్ ను తీవ్రంగా కొట్టింది తల్లి ఉదయ. తీవ్రంగా కొట్టిన అనంతరం సురారంలోని నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించింది. దెబ్బలు తట్టుకోలేక బాలుడు ఉమేష్(3) మృతి చెందినట్లు వైద్యులు నిర్దారణ చేశారు. తన భార్య మరియు భాస్కర్ అనే వ్యక్తే తన కుమారుడిని కొట్టి చంపారని భర్త సురేష్ ఆరోపణలు చేస్తున్నారు. వారి పెళ్లికి కుమారుడు అడ్డొస్తున్నాడని చంపినట్లు బాలుడి తండ్రి ఆరోపణలు చేస్తున్నాడు. అంతే కాదు.. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు సురేష్. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు ముమ్మురం చేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-