జగిత్యాలలో విషాదం.. కాలువలో తల్లీకూతుళ్ల మృతదేహాలు

నేటి సమాజంలో కొందరు చిన్నచిన్న విషయాలకు కఠిన నిర్ణయాలు తీసుకుంటు వారిని నమ్ముకున్న వారికి తీరని శోకంలో ముంచుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మెట్‌పల్లి మండలం ఆత్మనగర్‌ కు చెందిన తల్లీకూతుళ్ల వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

కుటుంబ కలహాలతో నిన్న ఇంటినుంచి వెళ్లిపోయిన తల్లి వనజ (28), కుమార్తె శాన్వి (6) లు వరద కాలువ దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఈ రోజు ఉదయం ఆత్మనగర్ వద్ద వరద కాలువలో వారి మృతదేహాలు లభ్యమవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Latest Articles