వారం రోజుల పసికందును అంత దారుణంగా ఎలా చేయగలిగావ్ తల్లీ..?

సమాజం మారుతోంది.. మహిళపై వివక్ష తగ్గుతోంది.. ఆడామగ ఇద్దరు సమానమే అనుకుంటున్నారు తల్లిదండ్రులు.. ఇక సమాజంలో స్త్రీల సంఖ్య పెరుగుతోంది అని ఆశించేలోపు ఎక్కడో ఒకచోట ఈ వివక్ష కనిపించడం బాధాకరమైన విషయం.. ఆడపిల్ల కడుపులో పెరుగుతోందని కడుపులోనే చంపేస్తున్నారు.. ఆడపిల్లలు పుట్టారని.. పుట్టినా వెంటనే గొంతు నులిమేస్తున్నారు.. తాజాగా ఒక తల్లి తనకు వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో.. మూడో బిడ్డను అతి కిరాతకంగా చంపిన దారుణ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. తాడికొండ మండలం రావెలకు చెందిన బొంతా లక్ష్మి కి కొన్నేళ్ల క్రితం వివాహమైంది.. ఆమెకు ఇద్దరు కుమార్తెలు.. ఈసారి ఎలాగైనా మగబిడ్డకు జన్మనివ్వాలని మూడో కాన్పు కోసం గుంటూరు జీజీహెచ్ లో జాయిన్ అయ్యింది. డిసెంబర్ 2 న ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో రెండు రోజులకే ఆమెను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే లక్ష్మీ మాత్రం ఆనందంగా లేదు.. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు.. మగబిడ్డకు ఎదురుచూస్తే మూడోసారి కూడా ఆడపిల్లే పుట్టింది.. ఎందుకు ఈ ఆడ సంతానం అని కోపంతో రగిలిపోయి.. వారం రోజుల పసికందు అని కూడా చూడకుండా పసిగుడ్డు నోట్లో వేళ్లు పెట్టి ఊపిరి ఆడనివ్వకుండా చేసి చంపేసింది. ఆ తరువాత ఏమి తెలియనట్లు బిడ్డ చనిపోయిందని తెలిపింది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ విషయం తెలుసుకున్న ఏఎన్ఏం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటన వెలుగుచూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు తల్లి లక్ష్మీని అరెస్ట్ చేశారు.

Related Articles

Latest Articles