అత్తాపూర్‌లో తల్లీ, ఇద్దరు పిల్లల మిస్సింగ్

అత్తాపూర్ ఎమ్ ఎమ్ పహాడీలో తల్లితో పాటు ఇద్దరు పిల్లల మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తల్లి అమ్రీన్, పిల్లలు అక్సా బేగం, అజా బేగం కనిపించకుండా పోయారు. వారు ఎంతకీ వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో సమీప బంధువులకు ఫోన్ చేసి వాకబు చేశాడు భర్త అభరార్. చుట్టూ పక్కల తీవ్రంగా గాలించిన భర్త. ఎక్కడా వాళ్ల ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో భార్యా పిల్లలు కనిపించకుండా పోయారంటూ ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Related Articles

Latest Articles