అంచనాలు పెంచిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్

అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’.. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఎంతోకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కు ఈ చిత్రం సక్సెస్ ఇచ్చేలా అంచనాలు పెంచింది ట్రైలర్.. లవ్‌, కామెడీ అంశాలతో ఆసక్తిగా రేకెత్తించగా.. అఖిల్, పూజా హెగ్డే జోడీ స్క్రీన్ ఫెయిర్ బాగుంది. మ్యారీడ్‌ లైఫ్‌ బాగుండాలంటే కెరీర్‌ బాగుండాలి అంటూ అఖిల్ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. ఇక పూజా హెగ్డే, అఖిల్ కు పూర్తి భిన్నంగా ఉన్నట్లు ట్రైలర్ బట్టి తెలుస్తోంది. ఇక ట్రైలర్ మధ్యలో జాతిరత్నాలు ఫ్రేమ్ ఫరియా, ఈషా రెబ్బా కనిపించారు.

ఈ జనరేషన్ ఆడియన్స్‌కు నచ్చేలా కథను తీసుకొస్తున్నాడు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో చిత్రయూనిట్ ఈ సినిమాపై చాలా నమ్మకంగా వుంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ రూపొందిస్తున్న ఈ మూవీని బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దసరా పండుగ సందర్బంగా అక్టోబర్ 15న థియేటర్లోకి రానుంది.

-Advertisement-అంచనాలు పెంచిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్

Related Articles

Latest Articles