‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నుంచి ‘లెహరాయి’ సాంగ్ ప్రోమో విడుదల

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈ సినిమాను బన్నీ వాసు, ద‌ర్శకుడు వాసు వర్మ కలిసి జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు చక్కటి స్పందన లభించింది. సోమవారం ఈ చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్ ‘లెహరాయి..’ ప్రోమో విడుదలైంది. ‘లెహరాయి లెహరాయి గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి’ అంటూ సాగే ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడారు. సెప్టెంబర్ 15న పూర్తి పాట విడుదల కానుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అవుతోంది. సినిమా అక్టోబర్ 8న విడుదల కానుంది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-