సూపర్ ఫుడ్: మునగాకుతో 300 వ్యాధులు దూరం

రుచిలోనూ, పోషకాలను అందించడంలోనూ మునగాకు చాలా విశిష్టమయింది. మన పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదనేది సామెత. మన చుట్టూ వున్న అనేక ఆకుకూరలు, కాయగూరలు అద్భుత ఔషధాలు. కానీ మనం వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాం. మునగచెట్టు అంటే కేవలం మునగకాడలే వాడాలని అంతా అనుకుంటారు. వాటికంటే మునగాకులోనే పోషకాలు ఎక్కువగా వుంటాయి. మనం రోజూ తినే ఆహార పదార్థాలు, కూరగాయలతో ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. మునగాకుతో ఇమ్యూనిటీ పెరగడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

ఫాస్ట్, జంక్ ఫుడ్‌కి యువత అలవాటు పడి కూరగాయలు, ఆకుకూరలను తినడం మానేయడంతో అనేక ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. ఎన్నో పోషకాలు, విటమిన్లు అందించే కూరగాయలు, ఆకుకూరలను చాలామంది తినడం లేదు. వెజిటేరియన్స్ మునక్కాయలు బాగా తింటూ ఉంటారు.

చాలామంది ఇష్టంగా వీటిని తింటూ ఉంటారు. మునక్కాయల్లో ఎ, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఆరోగ్యం అందించే ఎన్నో పోషకాలు వీటిలో వుంటాయి. అయితే మునక్కాయలే కాదు మునగాకు తినడం ద్వారా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 వ్యాధులకు చెక్ పెట్టే విటమిన్లు, పోషకాలు ఇందులో వున్నాయంటే ఆశ్చర్యపోక తప్పదు. కానీ ఇది నిజం.

మునగాకులో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఉంటాయి. అందుకే మునగాకును ఆయుర్వేద మందుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆయుర్వేద వైద్యులు మునగాకు తినమని చెబుతున్నారు. క్యారెట్లు తినడం ద్వారా వచ్చే విటమిన్లు మునగాకు తినడం వల్ల అధికంగా వస్తాయట. కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ లో మునగాకు వాడతారట. మునగాకు తింటే నేత్ర సంబంధమయిన ఇబ్బందులు తొలగడమే కాదు. కంటి చూపులో మెరుగుదల కనిపిస్తుంది.

మహిళలు రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్‌గా తీసుకుంటే 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. థైరాయిడ్, ఎముకలను బలంగా చేయడంలో మునగాకు ఉపయోగపడుతుంది. మహిళలకు వచ్చే రుతు సంబంధిత ఇబ్బందులకు మునగాకు మంచి మందు. మునగాకు రసాన్ని నిమ్మరసంతో కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు, బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

ఒక స్పూన్ మునగ పువ్వుల రసమును ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తాగితే ఉబ్బసానికి, అజీర్తి దూరమవుతుంది.మునగాకుని పొడిగా చేసుకుని ప్రతిరోజూ భోజనానికి ముందు రెండు ముద్దలు తింటే మూత్ర పిండాల వ్యాధులు, మలబద్దకం తగ్గుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మునగాకు రసము నందు నువ్వులనూనె కలిపి నీరంతా ఆవిరి అయ్యేంత వరకు మరగకాచి ఆ మిశ్రమాన్ని గజ్జి, దురద వంటి చర్మవ్యాధులకు పైపూత ముందుగా రాసుకుంటే తగ్గుతాయి.

Related Articles

Latest Articles