బయటకొస్తే కష్టం! ఇంట్లో కూర్చుంటే నష్టం! శిల్పా శెట్టికి 2 కోట్ల ‘సూపర్’ లాస్…

బిజినెస్ లో రిస్క్ మంచిదేగానీ… రిస్కే బిజినెస్ గా మారితే కష్టమే! కష్టం మాత్రమే కాదు పెద్ద నష్టం కూడా! ఇప్పుడు అదే జరుగుతోంది, పాపం శిల్పా శెట్టి విషయంలో. ఆమె భర్త చేసిన రిస్కీ బిజినెస్ ఇప్పుడు తనకు కష్టంగా, నష్టంగా మారుతోంది. నిజంగా రాజ్ కుంద్రా నేరం చేశాడో లేదోగానీ ఆయన అరెస్ట్ అయితే మిసెస్ కుంద్రాని కాలు బయట పెట్టనీయటం లేదు. అదే మానసిక వ్యధకి, ఆర్దిక నష్టానికి కారణం అవుతోంది…

Read Also: ఆ ఏడు సినిమాల పరిస్థితి ఏమిటీ!?

శిల్పా శెట్టి గత కొన్ని రోజులుగా మీడియా కెమెరాలకు దూరంగా ఉంటోంది. భర్త అరెస్ట్ నేపథ్యంలో ‘హంగామా 2’ ప్రమోషన్స్ కూడా ఆమె చేయలేదు. 14 ఏళ్ల తరువాత పెద్ద తెర మీద కనిపించినప్పటికీ కమ్ బ్యాక్ సందడి కూడా శిల్పా శెట్టికి కరువైంది. ఇక పోతే, ఆమెకు అసలు సమస్యంతా ‘సూపర్ డ్యాన్సర్’ రియాల్టీ షో రూపంలో ఎదురవుతోంది. డ్యాన్సింగ్ షోలో ఆమె వన్‌ ఆఫ్ ద జడ్జెస్. కానీ, గత రెండు వారాలుగా శిల్పా కనిపించటం లేదు. కరిష్మా కపూర్, జెనీలియా, రితేశ్ లాంటి ఇతర బాలీవుడ్ సెలబ్రిటీలు తన స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. ఇక మీదట కూడా ఆమె ‘సూపర్ డ్యాన్సర్’కి తిరిగి రాకపోవచ్చని కొందరంటున్నారు. కానీ, రాజ్ కుంద్రా రచ్చ చల్లబడితే శిల్పా వచ్చేస్తుందని కూడా గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఏ విధంగా చూసినా మరో నాలుగైదు వారాలు ‘సూపర్ డ్యాన్సర్ 4’కి మన ‘సాగరకన్య’ దూరంగా ఉండాల్సిందే…

Read Also: అడవి బిడ్డల కోసం ఆరాటపడే లాయర్ గా సూర్య!

తమ స్టార్ జడ్జ్ లేకపోవటం ‘సూపర్ డ్యాన్సర్’ నిర్వాహకులకి పెద్ద కష్టంగా మారింది. శిల్పాకి రీప్లేస్మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నించాల్సి వస్తోందట. మరోవైపు, ‘సూపర్ డ్యాన్సర్’ షోకి దూరంగా ఉండటం వల్ల శిల్పా శెట్టి కుంద్రాకి కూడా నష్టం భారీగానే ఉంటోందని సమాచారం. ఆమె ఒక్కో ఎపిసోడ్ కి 18-22 లక్షలు మధ్య ఛార్జ్ చేస్తుందట. అలా వారానికి రెండు ఎపిసోడ్స్ ప్రసారం అవుతాయి. మొత్తంగా ఒక పది ఎపిసోడ్స్ ఆమె జడ్జ్ గా అటెండ్ అవ్వలేకపోయినా 2 కోట్ల దాకా ఆదాయం గండి పడ్డట్టే! రాజ్ కుంద్రా పోర్న్ సినిమాలతో ఎంత వెనకేశాడోగానీ… శిల్పా మాత్రం కోట్లు కోల్పావాల్సి వస్తోంది!

-Advertisement-బయటకొస్తే కష్టం! ఇంట్లో కూర్చుంటే నష్టం! శిల్పా శెట్టికి 2 కోట్ల 'సూపర్' లాస్…

Related Articles

Latest Articles