రెండు లక్షలకు పైగా విద్యార్థులకు 10/10…

పదవ తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకొన్న 5,21,073  మంది విద్యార్థులు పాస్ అయ్యారు అని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వీరిలో 5,16,578 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 4,495 మంది గతంలో ఫెయిలై ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లించినవారు ఉన్నట్లు పేర్కొంది. రెగ్యులర్ గా హాజరై ఉత్తీర్ణత సాధించిన వారిలో 2,62,917 మంది విద్యార్థులు బాలురు కాగా, 2,53,661 మంది విద్యార్థులు బాలికలు ఉన్నారు. విద్యార్థులలో మొత్తం 2,10,647 మంది విద్యార్థులు 10/10 జి.పి.ఎ. సాధించినట్లు తెలిపారు. మొత్తం 535  పాఠశాలలు 10/10 జి.పి.ఎ. సాధించాయి. ఇంటర్నల్ అసెస్మెంట్  మార్కుల ఆధారంగా గ్రేడ్ లు ఇచ్చినట్లు చేప్పారు. WWW.bse.telangana.gov.in మరియు http .// results .BSETELANGANA .ORG వెబ్ సైట్ లలో సాయంత్రం మూడు గంటల నుంచి రిజల్ట్స్ చూసుకోవచ్చు. విద్యార్థులకు సంబంధించిన పాస్ మెమోలను సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా తీసుకోవాలి అని అన్నారు.

-Advertisement-రెండు లక్షలకు పైగా విద్యార్థులకు 10/10...

Related Articles

Latest Articles