ఆ రాష్ట్రంలో ప్రతి రెండు కరోనా పరీక్షల్లో ఒకరికి పాజిటివ్… 

ఆ రాష్ట్రంలో ప్రతి రెండు కరోనా పరీక్షల్లో ఒకరికి పాజిటివ్... 

దేశంలో కరోనా పాజిటివిటి రేటు పెరిగిపోతున్నది.  ముఖ్యంగా గోవాలో పాజిటివిటి రేటు 51శాతంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.దేశంలోనే అత్యధిక పాజిటివిటి రేటు ఉన్న రాష్ట్రంగా గోవా రికార్డ్ కెక్కింది.కరోనా టెస్టులు చేస్తున్న ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్టు అధికారులు చెప్తున్నారు.  లాక్ డౌన్ ఆంక్షలు విధిస్తున్న కట్టడి కావడం లేదు.  రోజు రోజుకు పాజిటివిటి రేటు పెరుగుతుండటంతో సంపూర్ణ లాక్ డౌన్ విధించడం ఒక్కటే మార్గం అని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు.  కొంతకాలం పాటు గోవా రాష్ట్రానికి పర్యాటకులను నిషేధించి లాక్ డౌన్ విధిస్తేనే కంట్రోల్ అవుతుందని లేదంటే మహమ్మారి విజృంభణకు గోవా బలికావాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  గోవా తరువాత 38 శాతం పాజిటివిటితో హర్యానా రెండో స్థానంలో ఉన్నది.   

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-